అక్షర టుడే, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం 237 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో గరిష్టంగా 1136 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. చివరికి 1064 పాయింట్ల నష్టంతో 80,684 వద్ద ముగిసింది. నిఫ్టీ 332 పాయింట్ల నష్టంతో 24,336 వద్ద క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 50లో సిప్లా మినహా మిగతా స్టాక్స్ అన్ని నష్టాలను చవిచూశాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, ఆసియన్ పెయింట్స్, ఎల్టీ, ఎం అండ్ ఎం, మారుతి, హీరో మోటార్, ఐచర్ మోటార్, బీపీసీఎల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, గ్రాసిం, డాక్టర్ రెడ్డి, ఆక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ, ఎస్బీఐ, నెస్లే, టాటా కన్స్యూమర్ భారీగా పతనమయ్యాయి.