అక్షరటుడే, నిజాంసాగర్‌ : పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం మహా పడిపూజ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్‌ సింధే, ఎస్‌.గంగారాం హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప దీక్షాపరులు, మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.