అక్షరటుడే, నిజాంసాగర్: ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రదర్శించినట్లు ఎంపీడీవో గంగాధర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జాబితాను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ తురాబ్, ఎంపీవో అనిత, పంచాయతీ కార్యదర్శులు సంతోష్, రవి రాథోడ్ ఉన్నారు