అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి రమ్య సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ పోటీల్లో రమ్య బంగారు పతకం సాధించిందన్నారు. ఈ సందర్భంగా రమ్యను గ్రామస్తులు అభినందించారు.