అక్షరటుడే, ఎల్లారెడ్డి: పద్మశాలి సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్ హరిహర కళాభవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పద్మశాలీల ఐక్యతకు పాటుపడతానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన శ్రీకాంత్ కు స్థానిక పద్మశాలీలు అభినందనలు తెలిపారు.