అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఏఎంసీ ఆధ్వర్యంలో లింగంపేట మండలంలోని మోతె గ్రామంలో మంగళవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఏఎంసీ ఛైర్పర్సన్ రజిత వెంకట్రాంరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ రాజు, పశు వైద్యుడు రవికుమార్, కాంగ్రెస్ నాయకులు నారాగౌడ్, రాంరెడ్డి, శంకర్ రావు, రైతులు పాల్గొన్నారు.