అక్షరటుడే, బోధన్‌: కాపర్‌ వైర్‌ చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణ శివారులోని బాబా గార్డెన్‌ సమీపంలో సీసీఎస్‌ ఏసీపీ నాగేంద్రచారితో కలిసి మంగళవారం వాహనాలు తనిఖీ చేపట్టారు. పట్టణానికి చెందిన సయ్యద్‌ ముహమ్మద్‌, షేక్‌ అన్సార్‌లు ద్విచక్ర వాహనంపై రాగి వైరును తీసుకెళ్తుండగా వెంబడించి పట్టుకున్నారు. వీరు గత నెలలో మాక్లూర్ మండలంలోని చిక్కిలి శివారులో ట్రాన్స్ ఫార్మర్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఇద్దరు నిందితుల నుంచి 18 కిలోల రాగి వైర్‌, ఒక మోటార్‌ సైకిల్‌, రెండు వాహనాలు, రెండు మొబైల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. వీరిపై బోధన్‌ టౌన్‌, బోధన్‌ రూరల్‌, రుద్రూర్‌, వర్ని, కోటగిరి, ఎడపల్లి, రెంజల్‌, నవీపేట్‌, నందిపేట్‌, నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలో పలు కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించిన సీసీఎస్‌ సీఐ సురేశ్‌, రవీందర్‌, హోంగార్డు గిరి, పోలీసు కానిస్టేబుల్‌ రాజేంద్ర ప్రసాద్‌, బోధన్‌ టౌన్‌ సీఐ వెంకట్ నారాయణ, పీసీ శ్రీకాంత్‌లను ఇన్‌ఛార్జి సీసీ సింధు, ఏసీపీ శ్రీనివాస్‌లు అభినందించారు.