అక్షరటుడే, వెబ్ డెస్క్: ఉత్తర భారతావనిని చలి గజగజ వణికిస్తోంది. హరియాణా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఫరీద్‌కోట్ లో మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. కాశ్మీర్ లోయలోని అత్యంత శీతలమైన జిల్లా కొనిబాల్, పాంపోర్ శివార్లలో.. కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 8.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్. ఇది సాధారణం కంటే 2.2 డిగ్రీలు తక్కువ. ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీలతో సాధారణం కంటే రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. బుధవారం గరిష్ట – కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 24 – 6 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.