రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణకు కొత్త అసెంబ్లీ భవనం అవసరమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం పక్కనే ఎన్టీఆర్‌ గార్డెన్‌లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే వ్యూ బాగుంటుందన్నారు. అసెంబ్లీ నిర్మాణానికి అవసరమైతే ఎఫ్టీఎల్ పరిధిని కుంచించవచ్చని పేర్కొన్నారు. సచివాలయం, అసెంబ్లీ, అమరవీరులస్థూపం.. హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున చూడచక్కగా ఉంటాయన్నారు. సచివాలయం, అసెంబ్లీ పక్కపక్కనే ఉంటే పాలనాపరంగా బాగుంటుందని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గత భారాస సర్కారు తమ మార్క్ చూపించుకునేందుకు.. పాత సచివాలయాన్ని కూలగొట్టి రూ.1,000 కోట్లతో ప్రస్తుత సచివాలయ భవనాన్ని నిర్మించింది. ఇప్పుడేమో.. కొత్త అసెంబ్లీ భవనం పేరుతో మరోసారి ప్రజాధనం వృధా చేసే ఆలోచన చేయడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెలువడుతున్నాయి.