అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని రెండో టౌన్ పరిధిలో గల మెడికల్ షాపులో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి పెద్ద పోస్టాఫీస్ సమీపంలోని ఓ మెడికల్ దుకాణం షెట్టర్ ఎత్తి దొంగలు లోనికి చొరబడ్డారు. షాపులోని నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.