అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వీడ్కోలు పలికారు. బోర్డర్‌ – గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ మూడో టెస్ట్‌ ముగింపు సందర్భంగా రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. తన కెరీర్ లో అశ్విన్‌ 106 టెస్టుల్లో 537 వికెట్లు తీశాడు. టెస్ట్‌ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సాధించారు.