అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభించగా.. మంత్రి బిల్లును ప్రవేశపెట్టి ప్రసంగించారు. ధరణి పోర్టల్‌ కారణంగా లక్షల సమస్యలు వచ్చాయని.. ఈ పోర్టల్‌ వల్ల ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల వద్ద పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా కోర్టులకు చేరాయని గుర్తు చేశారు. ప్రజల భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి తెలిపారు.