అక్షరటుడే, బాన్సువాడ/ఎల్లారెడ్డి: రాష్ట్ర సినిమాటోగ్రఫీ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజును బుధవారం ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ కలిశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజును పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.