అక్షరటుడే, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర వీఆర్వోల సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నీరడి శాంతయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మం పట్టణంలో బుధవారం జరిగిన సంఘం రాష్ట్ర మహాసభల్లో ఎన్నిక నిర్వహించారు. ఇందులో శాంతయ్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం కామారెడ్డి బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.