అక్షరటుడే, బోధన్: విద్యార్థులు వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని డీహెచ్‌ఈడబ్ల్యూ మిషన్ జిల్లా సమన్వయకర్త స్వప్న అన్నారు. బుధవారం పట్టణంలోని మధుమలాంచ జూనియర్ కళాశాలలో మాట్లాడారు. పీఎం కౌశల్ వికాస్ యోజనలో భాగంగా ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక అక్షరాస్యత నిపుణురాలు పుష్ప, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఆసియా, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.