అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఫార్ములా–ఈరేస్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. దమ్ముంటే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ ద్వారా సవాల్‌ విసిరారు. తన అరెస్ట్ విషయమై కేబినెట్‌ మీటింగ్‌లో గంటన్నర పాటు చర్చ జరిపారని, గవర్నర్‌ ఆమోదం వచ్చిందంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కేబినెట్‌ మీటింగ్‌లో నాలుగు గోడల మధ్య చర్చ జరిపే కంటే.. రాష్ట్ర శాసనసభలో చర్చ పెడితే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయన్నారు.