అక్షరటుడే, కామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సిబ్బందికి సూచించారు. బుధవారం రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల సర్వేకు సంబంధించిన యాప్ లో సమాచారం, ప్రస్తుతం ఇంట్లో నివసిస్తున్న ఫొటో, భూముల వివరాలు, కుటుంబ వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సర్వే పనులను వేగంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సువర్ణ, ఎంపీడీవో తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.