అక్షరటుడే, వెబ్‌డెస్క్: లగచర్ల కేసులో అరెస్టు అయిన వారికి బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు రైతులకు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. లగచర్ల గ్రామానికి వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేసిన ఘటనలో పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది.