అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: తమను రెగ్యులర్‌ చేయాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు పీఆర్‌టీయూ టీఎస్ నాయకులు బుధవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి వారి డిమాండ్లు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ టీఎస్ నిజామాబాద్‌ అర్బన్‌ నార్త్, సౌత్‌ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌ రెడ్డి, జావెద్, అస్రార్‌ అహ్మద్, అర్వింద్ ఉన్నారు.