అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: సినిమా అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాకు చెందిన కళా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దక్కన్ సర్కార్ పోస్టర్ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీసామనేది ముఖ్యం కాదని, ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు మల్లిక్ ఎంవీకే, చిత్ర హీరో చాణక్య, సామాజికవేత్త రంగనాయకుల సంతోష్ బాబు పాల్గొన్నారు.