అక్షరటుడే, నిజాంసాగర్: పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మద్నూర్ మండలం మోగా గ్రామానికి చెందిన బస్వంత్ రావు నాలుగు రోజుల కిందట తన చేనులో పనిచేస్తున్న క్రమంలో కాలికి పాము కాటు వేసింది. దీంతో గాయానికి కట్టు కట్టుకుని ఇంటికి వస్తుండగా, స్పృహ తప్పి అక్కడే పడి మృతి చెందాడు. బస్వంత్ రావు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం చేనులో మృతదేహం కనిపించడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు.