అక్షరటుడే, బాన్సువాడ: పండుగలు వేరైనా అన్ని మతాల సారాంశం ఒక్కటేనని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మీనా గార్డెన్లో శనివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం అన్నివర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ, బీర్కూర్ తహశీల్దార్లు వరప్రసాద్, లత, మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.