అక్షరటుడే, వెబ్‌డెస్క్: టీజీవో రాష్ట్ర కార్యదర్శిగా పూర్వ జిల్లా కో-ఆర్డినేటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి(ఆర్టీఓ, కామారెడ్డి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాంపల్లిలోని టీజీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అలుక కిషన్, డా.దేవేందర్, అమృత్ కుమార్, సాయిరెడ్డి ఆయన్ను సన్మానించారు.