అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని గూపన్ పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో శనివారం ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెడ్కో జూనియర్ మేనేజర్ అరుణ్, ఫీల్డ్ ఆఫీసర్ జగదీప్ రాము, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.