అక్షరటుడే, ఇందూరు: తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం హోమం నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మెకు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకుడు స్వామి యాదవ్ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, భూపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, మహిళా అధ్యక్షురాలు గంగామణి, స్వప్న, ప్రకాశ్, అప్సర్, రవికుమార్, సత్యపాల్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.