అక్షర టుడే, వెబ్ డెస్క్ : ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది. గ్రూప్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్ లు ఆడుతుంది. మార్చి 4న సెమీఫైనల్-1, 5న సెమీ ఫైనల్ -2, 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లో ఉండనున్నాయి. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.
