అక్షరటుడే, కామారెడ్డి : సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరింది. గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, సంతోష్ రెడ్డి, వీణ, శైలజ, కాళిదాస్, శ్రీవాణి, లావణ్య, గంగా ప్రసాద్, నయన దేవి, లక్ష్మణ్, రాజు, మాధవి, మౌనిక, సూర్యపాల్ పాల్గొన్నారు.