అక్షరటుడే, ఆర్మూర్ : కాకతీయ కెనాల్ ద్వారా నీటి విడుదల కొనసాగుతున్న క్రమంలో డీ 18,19,20 డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా ఏర్గట్ల మండలంలోని చెరువులు నింపాలని సీఈ సుధాకర్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏర్గట్ల గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని రైతులు కలిశారు. రైతుల వినతి మేరకు అక్కడి నుండే సీఈతో ఫోన్ లో ఎమ్మెల్యే మాట్లాడారు. వారం రోజుల్లో డీ 18,19,20 కాలువల ద్వారా చెరువులు నింపాలని లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.