అక్షరటుడే, ఎల్లారెడ్డి: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. లింగంపేట మండల కేంద్రంలోని ఓ ఇంట్లో దుండగులు చోరీ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేటకు చెందిన కొట్టూరు సుశీల మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. శనివారం ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి ఉండడంతో పాటు ఇంట్లోని వస్తువులు, దుస్తులను చిందరవందరగా పడేసి ఉన్నాయి. ఇంట్లో ఉన్న రూ.పది వేల నగదు సొమ్ము అపహరణకు గురైంది. అలాగే ఇంట్లో దుస్తులను దొంగలు తగులబెట్టినట్లు సమాచారం. ఈ విషయంపై ఎస్సైని సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన తెలిపారు.