Advertisement

అక్షరటుడే, ఇందూరు: దేశ ప్రధానిగా మోదీ.. నిజామాబాద్‌ ఎంపీగా ఏడీ(అర్వింద్‌ ధర్మపురి) మరోసారి ఎన్నికవడం ఖాయమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన నగరంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ప్రధాని మోదీ అధికారంలో ఉంటేనే దేశం మరింత పురోగమిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు మరోసారి బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన వెంటనే బీజేపీ నాయకులు ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | ప్రజావసరాలు పట్టించుకోకుండా విమర్శలా..?