ఒకే రోజు..ఇద్దరు సీఐల సస్పెండ్..

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: మల్టీ జొన్ -1 లో పనిచేస్తున్న ఇద్దరు సీఐలు సస్పెండ్ అయ్యారు. వీరిలో నిజామాబాద్ సీసీఎస్ సీఐ రమేష్, బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ఉన్నారు. ఈ మేరకు ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ రమేష్ మద్యం మత్తులో విధులు నిర్వర్తించడమే కాకుండా.. పలువురిని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై ‘అక్షరటుడే’లో కథనం కూడా ప్రచురితమైంది. విచారణ జరిపిన అధికారులు రమేష్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట సీఐతో బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తేలింది. తాజాగా ప్రేమ్ కుమార్ ను సైతం విధుల నుంచి తొలగించారు. ఒకేరోజు ఇద్దరు సీఐల పైన వేటు పడడం చర్చకు దారితీసింది.