అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా గడ్డం ఇందుప్రియ శుక్రవారం ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ నూతన చైర్‌పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.