అక్షరటుడే, ఎల్లారెడ్డి: పోచారం కాలువ నీటి విడుదలను వాయిదా వేసినట్లు నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఏ జోన్ కు రబీ పంటలకు జనవరి 1న సాగునీటిని విడుదల చేయాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జనవరి 3 లేదా 4న పోచారం ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేస్తామని ఆయన చెప్పారు.