అక్షరటుడే, కామారెడ్డి: సమగ్ర శిక్షా ఉద్యోగులు రోజుకో రీతిలో తమ నిరసన తెలుపుతున్నారు. నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. 22వ రోజు నిరసనకు తపస్ ఉపాధ్యాయ సంఘం, బీవీఎం విద్యార్థి సంఘ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శ్రీధర్ రాములు, కాళిదాసు, శైలజ, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.