అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.60కోట్ల నిధులు మంజూరయ్యాయని నుడా ఛైర్మన్ కేశ వేణు తెలిపారు. బుధవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని ఆయా డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మాణాల కోసం రూ.60కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేశారన్నారు. అదేవిధంగా అమృత్ స్కీం, యూజీడీ కోసం రూ.400కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తికాలేదని విమర్శించారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జావెద్ అక్రం, కార్పొరేటర్ ఖుద్దూస్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్‌గౌడ్, కార్పొరేటర్ రోహిత్, బీసీ సెల్ నగరాధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.