అక్షరటుడే, నిజాంసాగర్ : పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని అచ్చంపేట మోడల్ పాఠశాలలో విద్యార్థినులకు గురువారం షీ టీంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్ సైబర్ క్రైం, డయల్ 100, తదితర వాటిపై విద్యార్థినులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హర్థిక సంధ్య, షీటీం సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.