అక్షరటుడే, కోటగిరి: సీనియర్‌ సిటిజన్లు, రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగుల కోసం భవనం కేటాయించాలని పెన్షనర్స్‌ సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు వారు గురువారం సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతోను కలిసి వినతిపత్రం అందించారు. పోతంగల్‌ బస్టాండ్‌ సమీపంలో నిరుపయోగంగా ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ భవనాన్ని తమకు కేటాయిస్తే మరమ్మతులు చేయించుకుంటామని వివరించారు. కార్యక్రమంలో సీనియర్‌ సిటిజన్లు, రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.