అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : చలికాలంలో పేదల కోసం టీజీవో ఆధ్వర్యంలో దుప్పట్లు అందజేయడం అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ ఆధ్వర్యంలో సభ్యులు కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాథ శరణాలయాల పేదల కోసం 200 దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సంగం అమృత్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ జలగం తిరుపతిరావు, కోశాధికారి దేవిసింగ్, నాగమోహన్, యోహాన్, పావని, చందర్, అశోక్, రమేశ్ పాల్గొన్నారు.