అక్షరటుడే, బోధన్‌: పొలం దున్నుతున్న సమయంలో జరిగిన గొడవ.. చినికి చినికి గాలి వానలా మారి ఒకరిపై ట్రాక్టర్‌ ఎక్కించిన ఘటన బోధన్‌ మండలం పెగడాపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెగడాపల్లిలో శుక్రవారం లింగం అనే వ్యక్తి పొలం దున్నుతుండగా మట్టి పెల్లలు పడడంతో బబ్లూ అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో గొడవ పెద్దది కావడంతో బబ్లూపైకి లింగం ట్రాక్టర్‌ ఎక్కించాడు. తీవ్రంగా గాయపడిన బబ్లూను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.