అక్షరటుడే, ఇందూరు: నగరంలోని మెడికల్‌ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ శివప్రసాద్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్‌ కిషోర్‌కుమార్‌, కళాశాల అధ్యాపకులు నాగమోహన్‌, తిరుపతిరావు, ఏడీ సుదర్శన్‌, సూపరింటెండెంట్‌ పెద్దోళ్ల నాగరాజు, గంగాధర్‌, సాయిబాబా, గాయత్రి, జ్యోతి, గోవింద్‌, పృథ్వి, రంజిత్‌, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సైదా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవీణాపాల్, గాయత్రి, స్వాతిలను సన్మానించారు.