అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్‌లోని దూదేకుల కాలనీలో కోడి పందేలు ఆడుతున్న 13 మందిని అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుల వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి కోడి కత్తులు, రూ. 7,380 నగదు, 11 సెల్ ఫోన్లు, 4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.