అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని పతంగుల షాపులపై సీసీఎస్‌ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య, సిబ్బంది దాడులు చేశారు. పలు షాపుల్లో విక్రయిస్తున్న 20 బెండల్స్‌ చైనా మాంజాను పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.10వేలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారి టూ టౌన్‌ పోలీసులకు అప్పగించారు.