అక్షరటుడే, కామారెడ్డి: రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించామని జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని న్యూటన్, కామారెడ్డి శాంతినికేతన్, మాచారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సహాయ మోటార్ తనిఖీ అధికారి మహేశ్ కుమార్, నాగలక్ష్మి, రజినీబాయి, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.