అక్షరటుడే, వెబ్ డెస్క్: శబరిమలలో అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గత 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్పాట్‌ దర్శనానికి ట్రస్టు ఇప్పటికే 20 వేల టికెట్లు జారీ చేసింది. పంబ నుంచి సన్నిదానం వరకు క్యూలైన్లలో అయ్యప్ప భక్తులు భారీగా వేచి ఉన్నారు.