అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న డాకు మహారాజ్‌ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్‌లో మూవీ మేకర్స్‌ విడుదల చేశారు. ఫుల్ యాక్ష‌న్ వోల్టేజీతో ఉన్న ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవ నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్‌ బాబీ తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలుగా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.