అక్షరటుడే, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్‌కు రానున్నారు. సంధ్య థియేటర్‌ ఘటనలో విచారణకు బన్నీ హాజరు కానున్నారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని అల్లు అర్జున్‌కు కోర్టు ఆదేశాలున్నాయి. మరోవైపు అల్లు అర్జున్‌ ఇంటికి రాంగోపాల్‌పేట్‌ పోలీసులు వెళ్లారు. కిమ్స్‌లో శ్రీతేజ్‌ పరామర్శకు రావొద్దని నోటీసు ఇచ్చారు. అల్లు అర్జున్‌ మేనేజర్‌ మూర్తికి నోటీసు అందజేశారు.