అక్షరటుడే, వెబ్ డెస్క్: పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట అగ్గి రాజేసింది. దర్శకుడు త్రివిక్రమ్ మీద తాను ఫిర్యాదు చేస్తే.. ‘మా’ అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పూనమ్ కౌర్ పోస్ట్ చేశారు. కనీసం అతడ్ని ప్రశ్నించలేదని వాపోయారు. ‘నా ఆనందం, ఆరోగ్యం, జీవితాన్ని దెబ్బతీసిన త్రివిక్రమ్ ను ఇండస్ట్రీలోని కొన్ని పెద్ద తలలు వెనకేసుకొస్తున్నాయని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
స్పందించిన ‘మా’ అసోసియేషన్
పూనమ్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ‘మా’ కోశాధికారి శివబాలాజీ తెలిపారు. ఇలాంటి విషయాలు ట్విట్టర్‌లో పెట్టడం వల్ల ఉపయోగం లేదన్నారు. ‘మా’ అసోసియేషన్, కోర్టును ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.