అక్షరటుడే, నిజాంసాగర్‌: జవహర్‌ నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల విషయమై నిజాంసాగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నలుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేయడంతో పాటు వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు. గతంలో ఈ వ్యవహారంలో ఓ ఉపాధ్యాయుడిని అధికారులు కర్నాటకు బదిలీ చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు.