అక్షరటుడే, ఆర్మూర్: బీసీ ప్రజాగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ బీసీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్మూర్ తహశీల్దార్ గజానన్ కు బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనిల్, పులి యుగంధర్, కిరణ్, ఉదయ్ గౌడ్, బట్టు రాము, పోహర్ నవీన్, దాసరి గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.