అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. ఢిల్లీలో బీజేపీ నాయకుడు రమేశ్‌.. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం నిరసనకు దిగారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో బీజేపీ దళితమోర్చా కార్యకర్త తలకు గాయమైంది. పోలీసుల వైఫల్యంతోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు తమపై దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు.